ఖైరతాబాద్: హామీ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

66பார்த்தது
కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీ సమాజానికి ఇచ్చిన హామీ మేరకు రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి డిక్లరేషన్కు విరుద్ధంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి బడ్జెట్ నుంచే 20 శాతం నిధులు బీసీల కోసం ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి మోసగించారని మండిపడ్డారు.

தொடர்புடைய செய்தி