ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ వాన్‌గార్డ్, హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 చివరి నాటికి ప్రారంభమయ్యే ఈ కేంద్రం ఏఐ, డేటా అనాలిటిక్స్, మొబైల్ టెక్నాలజీల్లో ముందుండనుంది. నాలుగేళ్లలో 2,300 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.