ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో ఏంఐఏం ఎమ్మెల్యే మీర్జా రేహ్మత్ బెగ్ శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులపై చర్చించారు. పలు సమస్యలకు సంబంధించి జోనల్ కమిషనర్ కు ఎమ్మెల్సీ వినతిపత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలాగే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.