సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ అన్నారు. ఆదివారం చార్మినార్ కు చెందిన అష్రాఫ్ కి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. రూ. 2 లక్షల విలువ గల చెక్కును అందజేసినట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పొందవచ్చని తెలిపారు.