చార్మినార్ పోలీస్ స్టేషన్ స్థలం కబ్జాకు గురైంది. స్టేషన్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంపై ప్రైవేట్ వ్యక్తులు కన్నేశారు. గత కొంత కాలంగా 700 గజాల స్థలంలో పిల్లర్లతో పాటు స్లాబ్ నిర్మాణం చేపట్టారు. పనులు ఆపాలని పోలీసులు పలుమార్లు హెచ్చరికలు చేసినా బేఖాతరు చేశారు. దీనిపై కేసు నమోదైంది.