దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా గురువారం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకున్నారు.