స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ అంబర్ పేట్ సర్కిల్ డిప్యూటి మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం అంబర్ పేట్ లోని రఘునాథ నగర్లో మూడవ రోజు స్వచ్చధనం, పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసి పాల్గొని బస్తీ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.