ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వసీం సర్వత్ (50) అనే షూ వ్యాపారి తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో భార్యతో స్టేజీపై డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వసీంను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.