హోం మంత్రి అనిత కాన్వాయ్‌లో అపశృతి (వీడియో)

34982பார்த்தது
ఏపీ హోం మంత్రి అనిత కాన్వాయ్‌లో అపశృతి జరిగింది. తిరుమల దర్శనార్థం హోమ్ మినిస్టర్ తిరుమల వెళుతుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. హోం మినిస్టర్ కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలు పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో ప్రభాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ప్రభాకర్‌ను స్థానిక పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி