హోలీ పండుగ రోజు ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. రేవా జిల్లా గంభీర్ పూర్‌కు చెందిన అక్షయ్ లాల్ పటేల్ (45), బ్రిజేంద్ర పటేల్ (43), లవ్ కుష్ పటేల్ (20) హోలీ పండగును జరుపుకోవడానికి కత్రా అనే గ్రామానికి వచ్చారు. వేడుకల అనంతరం కారులో స్వగ్రామానికి వెళ్తుండగా కారు బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.