భారత్‌లో HMPV వైరస్ కేసులు నమోదవుతున్న వేళ తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ప్రకటన చేశారు. "చైనాలో HMPV కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంది." అని మంత్రి ఎక్స్‌లో ప్రకటన చేశారు.