యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాన్పూర్ జిల్లా కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాష్ట్రీయ ఇంటర్ కాలేజీ సమీపంలో అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం డ్రైవర్ కారును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయాలైన బైక్ రైడర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.