ఇజ్రాయెల్ సైనిక స్థావరాలే లక్ష్యంగా హెజ్బొల్లా విరుచుకుపడుతోంది. సౌత్ హఫియాలో డ్రోన్ UAVలతో దాడులు జరిపింది. ఈ ఘటనలో పలువురు ఇజ్రాయెల్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 61 మంది సైనికులు గాయపడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ హెర్జీ హలెవీ లక్ష్యంగా ఈ అటాక్స్ జరిగినట్లు సమాచారం. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.