భారత ప్రధానిగా 2004 మే 22 నుంచి 2014 మే 26 వరకు పదేళ్ల పాటు డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలందించారు. తన పదవీ కాలంలో ఒక్క రోజు కూడా ఆయన సెలవు పెట్టలేదు. అవిశ్రాంతంగా పని చేస్తూ, అవినీతి మరక పడకుండా నిజాయితీగా వ్యవహరించారు. పార్లమెంట్, బహిరంగ సమావేశాల్లో తప్పితే ఆయన ఎక్కువగా బయట మాట్లాడలేదు. 1991 అక్టోబర్1 నుంచి 2024 ఏప్రిల్3 వరకూ 33 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.