తనను ప్రేమించి దూరం పెడుతుందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్‌తో దాడి చేశాడు. APకి చెందిన మధుసూదన్‌రెడ్డి (22), ఓ యువతి (21) ఒకే కాలేజ్ లో చదువుకున్నా.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. ఇటీవల HYD అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారు. మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మధుసూదన్ ను యువతి దూరం పెట్టడంతో కోపం పెంచుకున్నాడు. గురువారం బ్లేడ్‌తో యువతి గొంతు కోశాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని యువతిని ఆసుపత్రికి తరలించారు.