రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు హరియాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆ రాష్ట్ర క్రీడా విధానం ప్రకారం వినేశ్ ముందు పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం, రూ.4 కోట్ల నగదు బహుమతి, స్థలంలో ఏది కావాలో తేల్చుకోవాలని సర్కారు కోరినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వినేశ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.