సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గురువారం ఉదయంమే కోకాపేటలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. హరీశ్‌రావును కలవడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.