TG: తెలంగాణ భవన్‌లో రేపు (మంగళవారం) గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతల సమావేశం ఉండనుంది. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించబోయే ప్లీనరీ బహిరంగ సభ విజయవంతం చేయడంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొంటారు.