విదేశీ విద్యానిధి పథకం అర్హులకు గుడ్ న్యూస్?

78பார்த்தது
విదేశీ విద్యానిధి పథకం అర్హులకు గుడ్ న్యూస్?
విదేశీ విద్యా నిధి పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే SC, ST, BC సంక్షేమ శాఖలు ఇందుకు సంబంధించిన ఫైల్ ను సీఎంఓకు పంపినట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైల్ ను సీఎం రేవంత్ ఆమోదిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బీసీ లబ్ధిదారులను 300 నుంచి 800, ఎస్సీలను 210 నుంచి 500, ఎస్టీలను 100 నుంచి 500కు పెంచాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఎంపికైన ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందనుంది.

தொடர்புடைய செய்தி