దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,580 ఉండగా, గురువారం నాటికి రూ.429 పెరిగి రూ.80,009కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.91,568 ఉండగా, ఇవాళ రూ.557 పెరిగి రూ.92,125గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ప్రొద్దుటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.80,009గా ఉంది. కిలో వెండి ధర రూ.92,125గా ఉంది.