గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ వ్యాపార విభాగం లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ తమ అడ్వాంటిస్ ఐఓటీ9 (Advantis IoT9) స్మార్ట్ లాక్‌ను తెలుగురాష్ట్రాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ స్మార్ట్ లాక్ శ్రేణి ఇంటికి మెరుగైన భద్రతను అందిస్తుంది. డిజిటల్ లాక్‌లలో IoT9ని పరిచయం చేసిన మొదటి బ్రాండ్ ఇదే.