కింగ్ ఫిషర్ బీరులో చెత్త.. వైన్ షాపు ముందు ఆందోళన (వీడియో)

62பார்த்தது
పండగ పూట బీరు కొంటే.. అందులో చెత్త వచ్చిందని మందుబాబులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగింది. నర్సింహులపేటలోని శ్రీ దుర్గా వైన్ షాప్‌లో కింగ్ ఫిషర్ బీరు కొనుగోలు చేశామని.. అందులో చెత్త వచ్చిందని వినియోగదారులు తెలిపారు. దీనిపై షాపు నిర్వాహకులను నిలదీయగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నారని వాపోయారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி