ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నవాబుపేట పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో జడ్చర్ల నియోజకవర్గం పరిదిలోని రుక్కం పల్లి, చెన్నారెడ్డి పల్లి, ఇప్పటూర్ గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు ఎవ్వరు చెరువు, కాలువల వైపు వెళ్లొద్దని సూచించారు. ప్రవాహం ఎక్కువగా వెళ్లే కాలువల దగ్గర జెండా పాతి రోడ్డును బందు చేసారు. అదే విదంగా ఇప్పటూర్ గ్రామంలో నడుమడుక వాగు తీవ్ర ప్రవాహం తో వెళుతుండటంతో పొలాలకు వెళ్లే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. ఎస్పీ వెంకటేశ్వర్లు, డిఎస్పీ మహాష్, ఎమ్మార్వో రాజేందర్, ఎంపిడిఓ శ్రీలత, ఆర్ఐ గోవర్ధన్, ఎస్సై శ్రీకాంత్, ఇప్పటూరు సర్పంచ్ గౌసియా బేగం, ఉపసర్పంచ్ రవికిరణ్ అబ్దుల్లా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది.