నారాయణపేట పట్టణంలోని ఎస్సి హాస్టల్ లో ఏర్పాటు చేసిన డిఎస్సీ ఉపాద్యాయ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ తనిఖీ చేశారు. పత్రాల పరిశీలన ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవ కేంద్రాన్ని, సౌకర్యాలను పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఘని పాల్గొన్నారు.