యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. గురువారం అమ్రాబాద్ మండలం మన్ననూర్ పిటిజి వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలిచిన టీమ్ కు బహుమతులు అందించారు. యువత శారీరకంగా, మానసికంగా ఉండాలంటే క్రీడలపై దృష్టి సారించాలన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఖాలీ సమయంలో క్రీడలపై దృష్టి సారించాలన్నారు.