నల్లమల్ల రాష్ట్రానికి ఆదర్శం కావాలని కృషి చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం ఉప్పునుంతల మండలం రాయిచెడులో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపనకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ బాయ్స్ (సమీకృత భవనాల నిర్మాణం) 300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.