అడవి ఉత్పత్తుల సేకరణకు వెళ్లి గత నెల 28వ తేదీన నల్లమల అటవీ ప్రాంతంలో తప్పిపోయిన చెంచు యువకుడు శంకర్ ను వెతకడానికి పోలీస్, అటవీశాఖ, రెవిన్యూ అధికారులు ముమ్మరంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ డ్రోన్ సహకారంతో మంగళవారం ముమ్మర గాలింపు చేపట్టిన ఆచూకీ లభించలేదు. దాదాపు 40 మంది ఆరు రకాల టీమ్ లతో మరియు డ్రోన్ సహాయంతో గాలించిన అతని ఆచూకీ లభించలేదని ఎస్ఐ వెల్లడించారు.