అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. గురువారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పదో వార్డు విటాయిపల్లి గ్రామంలో ఆయన సర్వే పత్రాలను విడుదల చేసి కార్డు ప్రాధాన్యతను వివరించారు.