క్రిస్మస్ వేడుకలు అచ్చంపేట నియోజకవర్గంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి డాక్టర్ అనురాధ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ నేతలు వివిధ చర్చిలలో ప్రార్థనలు పాల్గొన్నారు. యేసు చూపిన శాంతియుత మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. వివిధ చర్చిల పాస్టర్లు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.