మక్తల్: పార్థివదేహానికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే
మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి చెందారు. ఆదివారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.