కురుమూర్తి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నట్లు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు. నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని కోరారు.