రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, పంటలకు మద్దతు ధర పెంచుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ వాటిని అమలు చేయకుండా రైతులను మోసం చేశారని సీపీఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. మక్తల్ పట్టణంలో సోమవారం రెండవ రోజు కొనసాగిన సిపిఎం పార్టీ జిల్లా మహాసభలలో పాల్గొని మాట్లాడారు. రైతులకు వ్యతిరేకమైన నల్ల చట్టాలను తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కిందని, నమ్మించి మోసం చేశారని చెప్పారు.