మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం దెగ్లూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. దెగ్లూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నివృతి కొండిబ కాంబ్లె గెలుపుకు ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. జహీరాబాద్ ఎంపి సురేష్ శెట్కార్, నాయకులు పాల్గొన్నారు.