బ్యాంకు అధికారులు ప్రజలకు సేవలు అందించాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కెనరా బ్యాంకు శాఖను శుక్రవారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. బ్యాంకులోని అన్ని విభాగాలను పరిశీలించారు. పట్టణంలో కెనరా బ్యాంకు శాఖను ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. ప్రజలకు, వ్యాపారస్తులకు రుణాలు అందించి వారి అభివృద్ధికి అండగా నిలవాలని చెప్పారు.