రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని ఎమ్మెల్యే శ్రీహరి అన్నారు. సోమవారం మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని పశువుల ఆసుపత్రి వద్ద గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువులకు గాలికుంటు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా పశువులకు టీకాలు వేయించాలని అన్నారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.