మక్తల్ పట్టణంలో రెండు రోజుల పాటు జరిగే సీపీఎం పార్టీ జిల్లా ద్వితీయ మహాసభలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. కళాకారుల ప్రదర్శనలతో పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేసేది కమ్యూనిస్టులు మాత్రమే అని అన్నారు.