అమరచింతలో వెంకటస్వామి జయంతి వేడుకలు

85பார்த்தது
అమరచింతలో వెంకటస్వామి జయంతి వేడుకలు
అమరచింత మండల పరిషత్ ఎంపీపీ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎంపీ గుడిసెల వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీఓ నర్సింహయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. గుడిసెల వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్యాలయం ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி