మహబూబ్ నగర్ ఉమ్మడి కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. దుద్యాల మండలంలో ఏర్పాటు చేయనున్న ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ నేతలు బుధవారం పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బొంరాస్ పేట మండలం తుంకిమేట్ల చౌరస్తాలో డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.