నవాబుపేట ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు కొక్కళ్ల రాఘవేందర్, అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు దొంగళి రాజు, కార్యదర్శి అజయ్, కోశాధికారి శేఖర్ తో మహబూబ్ నగర్ జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు, రఘు రాములు, శ్రీనివాసులు, రవి, రాజు, శ్రీను, వెంకటేష్, నవీన్, యాదయ్య, శేఖర్, నరేష్, విష్ణు, మరియు కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఈ సమావేశంలో అధ్యక్షులు రాఘవేందర్ మాట్లాడుతూ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అందరూ ఐక్య మత్యంతో ఉంటేనే అసోసియేషన్ యొక్క అభివృద్ధి జరుగుతుంది అని సూచించారు, మండలం లో గల అన్ని గ్రామాల ఫోటో, వీడియో గ్రాఫర్స్ అందరికి అసోసియేషన్ లో సభ్యత్వం ఉంటేనే ఫోటో గ్రాఫర్లకు వచ్చే పధకాలకు అర్హులని చెప్పడం జరిగింది, త్వరలో సభ్యుఅందరికి అసోసియేషన్ ఐడికార్డు, మరియు సర్టిఫికెట్ అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.