నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటూరు సోలార్ విద్యుత్ వారు యాజమాన్యం మురళి, నరేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్ మరియు బ్యాగులు గురువారం పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోళ్ల నర్సింహులు మరియు ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ అబ్దుల్లా గౌసియా బేగం, ఉపసర్పంచ్ రవి కిరణ్, నవనీత్ రావు మరియు మండల ఫోటో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవేందర్ పాల్గొనడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది.