కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. బుధవారం గంగుల మాతృమూర్తి నర్సమ్మ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకునిన శ్రీనివాస్ గౌడ్ కరీంనగర్ వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నర్సమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.