చెరుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కృష్ణవేణి చక్కెర పరిశ్రమ యాజమాన్యం సహకరించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం నూతన సి. డి. సి. ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. చెరుకు రైతులకు ఉచితంగా విత్తనాలను ఎరువులను అందించాలని యాజమాన్యానికి సూచించారు. రైతుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.