రష్యాలో విమాన ప్రమాదం తప్పింది. సోమవారం రష్యా నుంచి బయలుదేరిన సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం తుర్కియే లోని అంటాల్యా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇవి కాస్తా నిమిషంలోనే విమానమంతా వ్యాపించాయి. వెంటనే స్పందించిన అధికారులు 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానం పూర్తిగా దగ్ధమైంది.