దేవరగట్టు కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న ముందస్తు చర్యలు ఎలాంటి ఫలితాలు ఇవ్వలేదు. అధికారులు రూపొందించిన ప్రణాళికలు అమలవ్వకపోవడం వల్ల ఈ సమరంలో 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా హోళగుంద మండలంలో ప్రతి సంవత్సరం దసరా రోజు అర్ధరాత్రి బన్ని ఉత్సవం జరగుతుంది.