కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులోని బాబూసాపాళ్యంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం మంగళవారం కుప్పకూలిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోగా, 13 మందిని రక్షించారు. ఇంకా శిథిలాల లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.