దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 12, 13 ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. షెడ్యూల్ ప్రకారం కాకుండా పలు రైళ్లు ఆలస్యంగా నడవటంతో ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో కాసేపు రైల్వే స్టేషన్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు అయోమాయానికి గురయ్యారు. పలు ట్రైన్లు ఆలస్యం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది.