వేసవిలో ఉల్లి తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇంకా గుండె ప్రమాదం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో వచ్చే కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.