సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా ఫన్నీ వీడియోలు కూడా ఉంటాయి. తాజాగా అటువంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పంజాబ్‌లోని ఓ రైల్వే స్టేషన్ బయట ఇద్దరు యువకులు బైకుపై వెళుతున్నారు. అదే సమయంలో వారికి ఎదురుగా ఓ యువతి రావడంతో ఇద్దరూ ఆమె వైపే చూస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న బారికేడ్‌ను ఢీకొట్టి కింద పడ్డారు. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.