కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం డా.అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీమ్‌ను ప్రారంభించింది. తొలిసారి కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రూ.2.5 లక్షల ఆర్థిక సహాయం రెండు వాయిదాలలో అందజేయబడుతుంది. దంపతులలో ఒకరు SC, మరొకరు ఇతర కులానికి చెందినవారు అయి ఉండాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షలను మించకూడదు. పూర్తి వివరాలకు https://ambedkarfoundation.nic.in/icms.html వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.