కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలొచ్చేలా ఉన్నాయన్నారు. మంత్రి స్థాయిలేకున్నా పెద్ద పదవి రావడంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఈ మేరకు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు.